శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని KSR ఎన్‌క్లేవ్ కాలనీలో సర్వీ సమాజ్ ట్రస్ట్ శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గామాత అమ్మవారి పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రామరాజు, సర్వీ సమాజ్ ట్రస్ట్ అధ్యక్షుడు మనోజ్ చౌదరి, మంగిలాల్ పరిహరియా చౌదరి ,వినోద్ చౌదరి, దేవరంజీ, బిక్రమ్ జి, కంగర్ సొయాల్ చౌదరి , హనుమన్ సోయల్ చౌదరి , మంగిలాల్ సొన్పర చౌదరి , వినోద్ గెహ్లాట్ చౌదరి, వినయ్ చౌదరి, కెహ్వరామ్ చౌదరి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






