యువ‌త వివేకానందుడి అడుగు జాడ‌ల్లో న‌డ‌వాలి: భేరి రామచందర్ యాదవ్

రామ‌చంద్రాపురం (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రామచంద్రపురంలోని అశోక్ నగర్ లో ఆదివారం గోకుల్ యూత్ నెరుసు శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి వికారాబాద్ జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌రై శిబిరాన్ని ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ స్వామి వివేకానంద చిన్న‌త‌నంలోనే దేశానికి పేరు ప్ర‌తిష్ట‌లు తెచ్చార‌ని అన్నారు. యువ‌త ఆయ‌న మార్గంలో న‌డ‌వాల‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ధైర్యంతో జీవించాల‌ని, అన్యాయాన్ని ఎదిరించాల‌ని అన్నారు. వివేకానందుడి అడుగు జాడ‌ల్లో యువ‌త న‌డ‌వాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో శివ యాదవ్, గోకుల్ యూత్ ప్రెసిడెంట్ కొలుసు వంశీకృష్ణ యాదవ్, కార్యవర్గ సభ్యుడు మాగంటి సతీష్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగంటి హరీష్ బాబు యాదవ్, కార్యవర్గ సభ్యులు మాగంటి చంద్రమోహన్ యాదవ్, స్వామి యాదవ్, శేరిలింగంపల్లి నియోజక వర్గం యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అందెల సత్యనారాయణ యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు చందు యాదవ్ పాల్గొన్నారు.

శిబిరంలో ర‌క్త‌దానం చేసిన వారికి ధ్రువ‌ప‌త్రాలను అంద‌జేస్తున్న భేరి రామచందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here