కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచానికి శాంతి నినాదాన్ని అందించిన మహోన్నతుడు మన జాతిపిత మహాత్మా గాంధీ అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పిలుపునిచ్చారు . మహాత్మా గాంధీ 151 వ జయంతిని పురస్కరించుకొని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ చందానగర్ చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలను వేసి అంజలి ఘటించారు. అనంతరం శ్రీరామ్ నగర్ చౌరస్తా లో గాంధీ పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

నిరాడంబరుడు, త్యాగశీలి, గొప్ప విద్యా వేత్త, సత్యాగ్రహి, అహింసావాదీ మన జాతిపిత మహాత్మ గాంధీ అని కొనియాడారు. ఆయన మనకందించిన అహింసావాదాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. మహాత్ముడు అందించిన నినాదం, అభ్యున్నతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత యువత పై ఉందన్నారు. కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట వార్డు మెంబర్ చాంద్ పాషా, మిర్యాల రాఘవరావు, ఎక్స్ కౌన్సిలర్స్ రవీందర్ రావు, మోహన్ గౌడ్, రాఘవేంద్ర రావు, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శివకుమార్, సెక్రటరీ వెంకట రమణ, సైబర్ హిల్స్ భాస్కర్ రెడ్డి, డా. మల్లేష్, వెంకటేష్, విజయ్ కుమార్ రెడ్డి, భాస్కర్, నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.






