హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాం నగర్ కాలనీలో రూ 48. లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో పెద్ద సంఖ్యలో సిసి రోడ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయడం జరుగుతుందని వెల్లడించారు.

కొన్నిచోట్ల విడిసిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తున్నానని, మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణంతో ప్రజలకు, వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సిసి రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారులకు సూచించారు. రోడ్లు వేసేటప్పుడు కాలనీ వాసులకు, వాహనదారులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ రాజీవ్, వర్క్ ఇన్ స్పెక్టర్ మహాదేవ్, వార్డ్ మెంబర్ విజయ, బోస్ రెడ్డి,
ఏరియా కమిటీ మెంబర్ రేణుక, శేషయ్య, టిఆర్ఎస్ నాయకులు రంగనాథరాజు, మురళీధర్ రావు, శేఖర్, మల్లేశం, రవి కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.





