శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామం లో రూ 48.00 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాలనీ వాసులు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు. రాబోవు కాలంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ నిఖిల్, గచ్చిబౌలి డివిజన్ మాజీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, సీనియర్ నాయకులు సురేందర్ ముదిరాజ్, నరేందర్ ముదిరాజ్, అశోక్ , నందు, సంజీవ, దయాకర్, నరేందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, దుర్గా రామ్, సుమన్, వర్క్ ఇన్స్పెక్టర్ బిక్షపతి, రాయదుర్గం వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






