శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): శివాజీ మహరాజ్ స్పూర్తి తో ధర్మ మార్గంలో నడుస్తూ, దేశభక్తి తో, మన దేశాన్ని ప్రపంచానికి విశ్వగురువు గా మార్చడానికి ప్రతి భారత పౌరుడు కృషి చేయాలని బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ న్యూ కాలనీ శివాలయం వద్ద నుండి తారా నగర్ తుల్జాభవాని ఆలయం వద్ద వరకు నిర్వహించిన ర్యాలీనీ జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ 396 వ జయంతి ఉత్సవాలలో భాగంగా మియాపూర్ డివిజన్ న్యూ కాలనీ శివాలయం వద్ద నుండి తారా నగర్ తుల్జాభవాని ఆలయం వద్ద వరకు నిర్వహించిన ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ బానిసత్వ చిహ్నాలను తొలగించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు. శివాజీ మహరాజ్ కేవలం ఒక ప్రాంతానికో, ఒక కులానికో పరిమితం కాదని, ఆయన హైందవ స్వరాజ్యం అంటే అది భారత స్వప్నం అని అన్నారు. శివాజీ మహరాజ్ సిద్ధాంతాలను పాటిస్తూ ఆయన చూపిన మార్గంలో మనమందరం నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






