శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పెబెల్స్ బే అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శ్రీకాంత్ శాలువాలతో సన్మానించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ పెబెల్స్ బే అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అపార్ట్మెంట్స్ అభివృద్ధి కోసం ప్రతి నివాసి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అపార్ట్మెంట్స్‌లో అవసరమైన అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు అపార్ట్మెంట్స్ వాసులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో పెబెల్స్ బే అపార్ట్మెంట్స్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరలో పూర్తి చేసి, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. అపార్ట్మెంట్స్‌ను ఆదర్శవంతమైన నివాస సముదాయంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండేపూడి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు నరేందర్, దుర్గా నాగేందర్, సీహెచ్ కిరణ్, అఖిల్, అనిల్, రాజు, ప్రసాద్, రాధాకృష్ణ, శ్రీవల్లి, అర్చన, భవాని, రవీందర్ రెడ్డి, మధు, కళ్యాణ్, శేషాంక్, వంశీ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.






