గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ తూర్పుకోట డివిజ‌న్ బిజెపి అభ్య‌ర్థికి మ‌ద్ధ‌తుగా రాఘ‌వేంద్రరావు ప్ర‌చారం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఎన్నిక‌లలో భాగంగా డివిజ‌న్ 37 తూర్పుకోట బిజెపి అభ్య‌ర్థి అర్ర శిరిషా కిర‌ణ్ పిట్ట‌ల‌కు మ‌ద్ధ‌తుగా మియాపూర్ డివిజ‌న్ బిజెపి ఇన్చార్జీ క‌ర్ల‌పూడి రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌చారం నిర్వ‌హించారు. అక్క‌డి కాల‌నలు, బ‌స్తీల‌లో తిరుగూతు అర్ర శిరీష కిర‌ణ్‌కు మ‌ద్ధ‌తు తెల‌పాల‌ని స్థానికుల‌ను కోరుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సంద‌ర్భంగా రాఘ‌వేంద‌ర్‌రావు మాట్లాడుతూ గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిపల్ ఎన్నిక‌ల్లో బిజెపి జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని అన్నారు. ఎక్క‌డికి వెళ్లిన ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భిస్తుంద‌ని అన్నారు.

అభ్య‌ర్థి శిరిషా కిర‌ణ్‌కు మ‌ద్ధ‌తుగా తూర్పుకోట‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న‌ రాఘ‌వేంద్ర‌రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here