నమస్తే శేరిలింగంపల్లి: గతంలో జరిగిన వరద ముంపు సమస్యను దృష్టిలో ఉంచుకుని మరోసరి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చందానగర్ డివిజన్ పరిధిలోని లింగంపల్లి నాలా పూడికతీత పనులను స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనుల్లో వేగం పెంచాల్సిందిగా సూచించారు. వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వకుండా చూడాలన్నారు. భారీ నుంచి అతి భారీ వరదలు వంచిన ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.