నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఆదివారం ఓటు హక్కును సద్వినియోగ పర్చుకున్న పట్టభద్రులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి వర్యులు కేటీఆర్ సూచనల మేరకు ప్రతి రోజు పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపు కొరకు అహర్నిశలు కష్టపడిన కార్పొరేటర్లకు, తెరాస నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. అదేవిదంగా ఎన్నడూ లేని విధంగా పట్టభద్రులు అధిక శాతం ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా శుభపరిణామని, ప్రజస్వామ్యంలో రాజ్యాంగం ద్వారా కలిపించిన ఓటు హక్కు ను సద్వినియోగ పర్చుకోవడం చాలా శుభసూచమని, ఓటింగ్ సరళిని బట్టి మనం పడిన కష్టానికి ప్రతి ఫలంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవి అఖండ మెజార్టీతో గెలుస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.