చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలని మిరియాల ప్రీతమ్ కోరారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ బస్తీలో ఇంటింటికీ తిరుగుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రజలకు రాఘవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిరియాల రాఘవరావు, టీఆర్ఎస్ యువనేత మిరియాల ప్రీతమ్ అవగాహన కల్పించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2020/10/mir-vo.jpg)
ఈ సందర్భంగా ప్రీతమ్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రజలు, యువత ముందుకు వచ్చి తమ బాధ్యతగా ప్రతి ఒక్కరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా కొత్తగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమీర్, మోహిత్, మల్లికార్జున్, ప్రీతేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.