శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా ఇటీవలే నూతనంగా నియామకమైనందుకు గాను రవికుమార్ యాదవ్‌కు హైదర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీతారామరాజు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. మసీదుబండలోని రవికుమార్ యాదవ్ నివాసానికి సీతారామరాజు పార్టీ కార్యకర్తలతో తరలివెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీతారామరాజు మాట్లాడుతూ గ్రేటర్ లో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా రవికుమార్‌యాదవ్ నాయకత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 10 డివిజన్లకు గాను 10 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా కార్యకర్తలంతా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలయ్య, అంజయ్య, తుకారం, రమేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.