కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రుల ఓటరు నమోదులో ప్రతి గ్రాడ్యుయేట్ పాల్గొని, తెరాస బలపర్చిన అభ్యర్థులకు ఎమ్యెల్సీ ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రుల దగ్గరకు వెళ్లి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అభ్యర్ధించారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ బ్లాకులో ఆయన పర్యటించి పట్టభద్రులను కలసి ఎమ్యెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వారికి వివరించారు. ఎమ్యెల్సీ ఓటరు నమోదు దరఖాస్తులను వారికి అందజేశారు.
రానున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్థులు కచ్చితంగా గెలిచి విజయకేతనం ఎగురవేస్తారని అన్నారు. యావత్ తెలంగాణ మొత్తం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తెరాస అభ్యర్థులకు బలమని అన్నారు. ప్రజలలోకి వాటిని తీసుకుని వెళ్లే బాధ్యత ప్రతి తెరాస కార్యకర్తకు ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ శ్రీనివాస్ చౌదరి, జంగంగౌడ్, తెరాస సీనియర్ నాయకులు సయ్యద్ ఉస్మాన్, అంజాద్ అమ్ము, అహ్మద్, శంకర్ నాయక్, లాలు, వర్ధన్ యాదవ్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.