- కార్పొరేటర్ హమీద్ పటేల్
కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క పట్టభద్రుడు చురుగ్గా పాల్గొని, ఓటును నమోదు చేసుకోవాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ డీఎస్సార్ అపార్ట్‌మెంట్స్ అసోసియేషన్ సభ్యులను కలసి ఎమ్యెల్సీ ఓటరు దరఖాస్తు ఫాం18లను అందించి, రానున్న ఎమ్యెల్సీ ఎన్నికలలో తెరాస బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
పట్టభద్రులు ఎక్కువగా ఉన్న మాదాపూర్ ప్రాంత గ్రేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్‌మెంట్స్ వాసులు అందరూ కూడా పట్టభద్రుల ఓటరు నమోదు చేయించుకొని, తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రాజు యాదవ్, కావూరి హిల్స్ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.