కాషాయ కండువా కప్పుకున్న బోయిని మహేష్ యాదవ్

బోయిని మహేష్ యాదవ్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, స్థానిక నాయకులు మువ్వా సత్యనారాయణ

హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పెట్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు బోయిని మహేష్ యాదవ్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మహేష్ యాదవ్ శనివారం రాత్రి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకున్నారు. ఎల్బీనగర్ లో జరిగిన ఆ పార్టీ ప్రత్యేక సమావేశాల్లో అర్భన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, స్థానిక నాయకులు మువ్వా సత్యనారాయణ, గజ్జల యోగానంద్, జ్ఞానేంద్ర ప్రసాద్ ల సమక్షంలో మహేష్ యాదవ్ తో పాటు పలువురు బిజెపి లో చేరారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ పరిపాలన దక్షత, బిజెపి కార్యకర్త లోని క్రమశిక్షణ, అంకితభావాన్ని మెచ్చి ఆ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ముందుకు సాగుతానని అన్నారు. డివిజన్ అధ్యక్షుడు శ్రీధరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలివేముల మనోహర్, నాగులు గౌడ్, కోటేశ్వరావు, నర్సింహారావు, రవి గౌడ్, వరప్రసాద్, బాబు రెడ్డి, మణిక్ రావు, జితేందర్ కళ్యాణ్ భరద్వాజ్, హరిప్రియ, నవీన్, లక్ష్మన్ గౌడ్ ఆకులమహేష్, రామ కృష్ణ, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.

బోయిని అనూష మహేష్ యాదవ్ కు పార్టీ కండువా కప్పుతున్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

కార్పొరేటర్ బరిలో అనుష మహేష్ యాదవ్..?
మహేష్ యాదవ్ తో పాటు ఆయన సతీమణి అనుష యాదవ్ సైతం బీజేపీలో చేరారు. నిన్నటి వరకు గృహిణిగా ఉన్న అనుష యాదవ్ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చేతులమీదుగా కండువ కప్పుకోవడం డివిజన్ లో చర్చకు దారితీస్తుంది. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లే యధావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర మంత్రివర్గం తేల్చడం, ఈ క్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ లో మహిళకే అవకాశం ఉండడంతో బోయిని అనూష మహేష్ యాదవ్ కార్పొరేటర్ బరిలో నిలిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమేరకు స్పష్టత వచ్చాకే పార్టీలో చేరినట్టు మహేష్ యాదవ్ సన్నిహితులు పేర్కొంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here