శేరిలింగంపల్లి ( నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ తుల్జాభవాని ఆలయ పాలకమండలి సభ్యులు ఆదివారం శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున శర్మ, సభ్యులు సంజీవ రెడ్డి, సంపత్, గోవింద చారి, రేణుక గౌడ్, రాజు తివారి, రవీందర్ లు గాంధీకి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని, భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా నిర్వహణలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఆలయ అభివృద్ధి విషయంలో వ్యక్తిగతంగా ఇటు తన నుంచి, అటు ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.