ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలి

  • ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప‌ట్ట‌భ‌ద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోసం ఓట‌ర్లుగా న‌మోదు చేసుకోవాల‌ని నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ర‌వికుమార్ యాద‌వ్ అన్నారు. సోమ‌వారం ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదుపై అవ‌గాహ‌న కార్యక్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ ప‌ట్ట‌భ‌ద్రులు ఓట‌ర్లుగా న‌మోదు చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఓట‌రు న‌మోదు చేయించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తియాద‌వ్‌, నాయ‌కుడు బొల్లేపల్లి సీతారామరాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ర‌వికుమార్ యాద‌వ్‌, భిక్ష‌ప‌తియాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here