శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ హఫీజ్‌పేటలో వినాయక నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపం వద్ద మామిడి రాజా గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అలాగే నిమజ్జన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వేలం పాటలో గణేషుడి లడ్డూను రూ.93వేలకు టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ కనుకమామిడి సురేందర్ గౌడ్ కైవసం చేసుకున్నారు. వరుసగా ఆయన మూడో సారి గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు. అలాగే రెండవ లడ్డూను రూ.41వేలకు బాలింగ్ శేఖర్ గౌడ్ కుమారుడు బాలింగ్ నీతేష్ గౌడ్ దక్కించుకున్నారు.






