శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో ఏకదంత వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాధునికి ఘనంగా పూజలు నిర్వహించారు. నేతాజీ నగర్ మేస్త్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కంటెస్టెంట్ కార్పొరేటర్ మారబోయిన రవి యాదవ్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, రవి నాయక్, మోహన్ చారి, సత్యమ్మ, జయ రెడ్డి, చిట్టెమ్మలాల్ రెడ్డి, రాధా రాణి రెడ్డి, యువజన నాయకులు డీజే భవన్, రాజు, భేరి శ్రీనివాస్ యాదవ్, సలీం, లవణాచారి, భేరి చంద్రశేఖర్ యాదవ్, అశోక్, శ్యామ్ రావు, సాయిచంద్, అంకంరావు, శ్రీనివాస్, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, నర్సింలు, నర్సింగరావు, రవి, మాధవరావు పాల్గొన్నారు.







