నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో వికారాబాద్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. యాత్ర ఎనిమిదవ రోజులో భాగంగా శనివారం బండి సంజయ్ పాదయాత్ర వికారాబాద్ లో కొనసాగింది. కాగా అటు బీజేపీ శ్రేణులు ఇటు స్థానిక ప్రజల నుండి యాత్రకు విశేష స్పందన లభించింది. పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ పాదయాత్రలో పాల్గొని బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగారు. వికారాబాద్ తో పాటు గత ఎనిమిది రోజులుగా ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల ఉత్సాహం చూస్తుంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందని, బిజెపి గెలుపు ఇక ఆపడం ఎవరి తరం కాదని రవి కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో శేరిలింగంపల్లిలోను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.
