పర్ల్స్ విలేజీలో వంద శాతం వ్యాక్సినేషన్: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కట్టడే లక్ష్యంగా ప్రతీ ఒక్కరులూ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. డివిజన్ పరిధిలోని పర్ల్స్ విలేజ్ లో వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసిన సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదివారం పర్ల్స్ విలేజ్ అసోసియేషన్ సభ్యులకు వ్యాక్సినేషన్ సిర్టిఫికెట్ ని అందజేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు జిహెచ్ఎంసి శానిటేషన్ కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, అందులో భాగంగా ఉచిత వ్యాక్సినేషన్ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రావు, అనంతరామ్, జనరల్ సెక్రటరీ జ్యోతి, విశాల్ రావు, కమిటీ మెంబర్ అనిత, ఎస్ ఆర్ పీ కృష్ణ, గోపినగర్ బస్తి కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, మహేష్ చారీ, సుభాష్ రాథోడ్ శనిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పర్ల్ విలేజీ అసోసియేషన్ వారికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను అందజేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here