విందులో బంధువుల‌తో పేకాడుతూ బుక్కైన కృష్ణుడు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బంధువుల ఇంటికి శుభ‌కార్యానికి వ‌చ్చి పేకాడుతూ సినీన‌టుడు కృష్ణుడు అరెస్ట‌య్యాడు. మియాపూర్‌లో కొందరు వ్య‌క్తులు పేకాడుతున్న‌ట్లు స‌మాచారం అందుకున్న పోలీసులు దాడి చేయ‌గా కృష్ణుడుతో పాటు అత‌ని బంధువులు మ‌రో ఏడుగురిపై కేసు న‌మోదు చేశారు. మియాపూర్ శ్రీ‌ల ప్రైడ్ పార్క్ లోని ఎల్‌-59 నెంబ‌రు ఇంటిలో కొంద‌రు వ్య‌క్తులు పేకాడుతున్న‌ట్లు మియాపూర్ ఎఎస్ఐగా ప‌నిచేస్తున్న ఎస్‌.నాగ‌రాజులు పోలీస్‌స్టేష‌న్ కు స‌మాచారం అందించాడు. ఎసిపి ఆదేశాల‌తో ఇంటిపై దాడి చేసిన పోలీసులు డ‌బ్బులు పెట్టి పేకాడుతున్న పెద్దిరాజు, సూర్య‌నారాయ‌ణ‌రాజు, మ‌ణిరాజు, విశ్వ‌నాథ‌రాజు, కె.జి.కె.రాజు, రవిరాజు, కె.కృష్ణంరాజు(కృష్ణుడు), కె.ఎస్‌.ఆర్ కుమార్‌ల‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. వారి వ‌ద్ద నుండి రూ.1,97,530 న‌గ‌దు, 8 సెల్ ఫోన్లు, రెండు సెట్ల పేక‌లు, స్కోరు బుక్కును స్వాధీనం చేసుకుని నిందితుల‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here