శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ఆల‌యంలో ఘ‌నంగా వెంక‌టేశ్వ‌ర స్వామి వారి క‌ల్యాణం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్ అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో కార్తీక మాసం సంద‌ర్భంగా ల‌క్ష దీపోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని ఘనంగా నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం సాయంత్రం 7 గంట‌ల‌కు శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి క‌ల్యాణాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌లు, భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here