శేరిలింగంపల్లి, నవంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వంలో భాగంగా షేక్‌పేట్ డివిజన్‌లోని ద్వారక నగర్ ప్రాంతంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా షేక్‌పేట్, గచ్చిబౌలి డివిజన్‌ల నాయకులు స్థానిక నేతలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పన్నెండేళ్లుగా ఇరు పార్టీలను నమ్మి ప్రజలు ఓటు వేసినా, నాయకులు మాత్రమే సంపన్నులై సుఖంగా ఉన్నారని, కానీ జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీలకు చరమగీతం పాడి, అభివృద్ధి చేయగలిగే మోదీ పాలనను జూబ్లీహిల్స్‌కు అందించేందుకు బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

నవంబర్ 11న జరగబోయే ఉప ఎన్నికలో ప్రజల జీవితాలకు భరోసానిచ్చిన బీజేపీకి మద్దతు తెలుపుతూ1వ నంబర్ కమలం గుర్తుకు ఓటు వేసి లంకల దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్ నిజమైన అభివృద్ధి సాధించాలంటే ప్రజలకు అందుబాటులో ఉండే, సేవాభావంతో పనిచేసే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివసింగ్ రాందీన్, షేక్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్, సీనియర్ నాయకులు మీన లాల్ సింగ్, స్వామి గౌడ్, నరేందర్ యాదవ్, దయాకర్, వరలక్ష్మి ధీరజ్, ఉదయ లక్ష్మీ, రంజిత్ పూరి, సుమన్, శేఖర్, శ్యామ్ యాదవ్, సామ్రాట్ గౌడ్, దుర్గా రామ్, గోపాల్, రాహుల్, గణేష్ ముదిరాజ్, విజయ్, మహేష్ పాల్గొన్నారు.





