వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్ 33 బ్లాక్ రోడ్ నం.2 లో 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావులు బుధవారం పరిశీలిచారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు. గత 20 సవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ తమను పట్టించుకోలేదని, కేవలం తెరాస ప్రభుత్వమే తమ సమస్యలను పట్టించుకుందని అన్నారు. ఇందుకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీతోపాటు కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయికి మద్దతు తెలుపుతున్నామని అన్నారు.
అనంతరం కార్పొరేటర్ ఎం.లక్ష్మీబాయి, మాధవరం రామారావు మాట్లాడుతూ.. వివేకానందనగర్ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని అన్నారు. ప్రజలు ఎవరైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకవస్తే వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కమిటీ సభ్యుడు వెంకటస్వామి సాగర్, సీనియర్ నాయకుడు, డివిజన్ ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ హరినాథ్, స్థానిక పెద్దలు, నాయకులు జితేందర్ చారి, బలరాం, రాందేవ్ రెడ్డి, సూరిబాబు, నాగరాజు, హరి, నర్సింహులు, హన్మంత్ రావు, పద్మ, రమేష్ చారి, సిద్ది రాములు, లక్ష్మి, కుమారి, విజయలక్ష్మీ, నాగమణి, బాలమణి, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.