-వాహనదారులకు మియాపూర్ ట్రాఫిక్ పోలీసుల అవగాహన
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ట్రాఫిక్ సీఐ సుమన్ ఆధ్వర్యంలో చందానగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ప్రమాదాల బారిన పడి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని. వారి ప్రాణాలు కాపాడుకునేందుకు నాణ్యమైన హెల్మెట్లు ధరించాలని సూచించారు. చలనాల కోసం కొందరు నాణ్యత లోపించిన హెల్మెట్లు ధరిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని హెచ్చరించారు. బండి పై వెళ్లే ఇద్దరు హెల్మెట్లు హెల్మెట్ విధిగా ధరించాలని అన్నారు. నాణ్యతతో కూడిన గుర్తింపు గల హెల్మెట్ ను ధరించే ప్రయాణం చేయాలని సూచించారు. వాహనాలు నిలిపివేస్తూ హెల్మెట్ లేని వాహనదారులకు చలానా వేయకుండా అక్కడే హెల్మెట్లు కొని ధరించే విధంగా వారికి ప్రోత్సహించారు. మనిషి ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను డ్రైవ్ చేయాలని, ప్రమాద సూచికలు ఉన్నచోట నిదానంగా వెళ్లాలని ట్రాఫిక్ సిఐ సుమన్ తెలిపారు.