చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ వేముకుంట బస్తీలో ఆదివారం సాయంత్రం తెలంగాణ సుఫియ కౌన్సిల్(హైదరాబాద్) ఆద్వర్యంలో జల్సా ఫైజాన్ ఈ గౌసియా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కౌన్సిల్ అధ్యక్షుడు మౌలానా అల్ హజ్ మహమ్మద్ జావిద్ హుస్సేన్ ఖాద్రీ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు మౌలానా సయ్యద్ షా బషీరుద్ధీన్ అల్ హసన్ వల్ హుస్సేనీ ఖాద్రీ, మౌలానా హజ్రత్ సయ్యద్ ఖాదర్ మోహినుద్ధీన్, మౌలానా సయ్యద్ ఖాజా మహమ్మద్, హజ్రత్ మహమ్మద్ ఆదిల్ ఖాద్రీ నిజామి తస్కీన్ లతో పాటు పలువులు మషయిక్, స్కాలర్స్, నాథ్‌ఖాన్‌లు పాల్గొన్నారు.
