మాదాపూర్ డివిజ‌న్‌లో భాజపా బ‌ల‌ప‌డింది

  • డివిజ‌న్ సమీక్ష స‌మావేశంలో గ‌జ్జ‌ల యోగానంద్‌, ర‌వికుమార్ యాద‌వ్‌లు

మాదాపూర్ (న‌మ‌స్తేశేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజ‌న్ నుంచి బిజెపి కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిగా పోటీచేసిన గంగ‌ల రాధ‌కృష్ణ య‌ద‌వ్ ఆద్వ‌ర్యంలో ఆదివారం సాయంత్రం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పార్టీ నియ‌జక‌వ‌ర్గ ఇంచార్జ్‌ గ‌జ్జ‌ల యోగానంద్‌, యువ‌నేత‌ ఎం.ర‌వికుమార్ యాద‌వ్‌లు రాధకృష్ణ యాద‌వ్‌ను, డివిజ‌న్ కార్య‌క‌ర్త‌ల‌ను అభినందించారు. త‌క్కువ స‌మ‌యంలోను మిక్కిలి కృషి చేశార‌ని, డివిజ‌న్‌లో పార్టీకి మంచి గుర్తింపు తీసుకువ‌చ్చార‌ని కొనియాడారు. ఇదే స్పూర్తితో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో దూసుకుపోవాల‌ని, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. ‌అనంత‌రం గచ్చిబౌలి డివిజ‌న్ నుంచి భాజాపా త‌ర‌పున గెలుపొందిన కార్పొరేట‌ర్ వి.గంగాధ‌ర్‌రెడ్డిని వారు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర నాయ‌కులు జ్ఞానేంద్ర ప్ర‌సాద్‌, డివిజన్ అధ్యక్షులు వినయ్ బాబు, నాయ‌కులు గంగ‌ల న‌ర్సింహా యాద‌వ్‌, జంగ‌‌య్య యాద‌వ్‌, శిరీష రెడ్డి, రవియదవ్, శ్రీశైలం యాదవ్, హరి, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

స‌మావేశంలో పాల్గొన్న కార్య‌క‌ర్త‌ల‌తో నాయ‌కులు గ‌జ్జ‌ల యోగానంద్, ర‌వికుమార్ యాద‌వ్‌, రాధ‌కృష్ణ యాద‌వ్‌, కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here