నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ వేమన రెడ్డి కాలనీలోని సివేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి, జీహెచ్ంఎసీ, జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలసి ప్రభుత్వ విప్ గాంధీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం అని, సెవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాలల్లోని ప్రజలు దుర్ఘందంతో అవస్థలు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్లాంట్ చుట్టు వాసన రాకుండా విరివిగా మొక్కలు నాటాలని, అన్ని హంగులతో సుందరవనంగా తీర్చిదిద్దలాని, అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. మురుగు నీటి శుద్ధి తర్వాత వదిలే ఔట్ లెట్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ,జలమండలి, ఇరిగేషన్ అధికారులందరు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని, ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని స్థానిక ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎస్ఈ చిన్నా రెడ్డి, ఈఈ శంకర్, డీఈ రూపదేవి, ఏఈ అనురాగ్, ఇరిగేషన్ ఏఈఈ శేషగిరి రావు, ఎస్‌టీపీ జీఎం వాస సత్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు అక్బర్ ఖాన్, దాస్, కొండల్ రెడ్డి, జగదీష్, గుడ్ల ధనలక్ష్మి, కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, సురేందర్, కృష్ణ రెడ్డి, మాల్లారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






