నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో సోమవారం తాగునీటి పైప్లైన్ పగిలి పెద్ద మొత్తంలో నీరు వృదా పోయింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సంబంధిత అధికారులతో దగ్గరుండి సమస్యను పరిష్కరించారు. కార్పొరేటర్ సత్వర స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.