తెలంగాణ రక్ష‌ణ సేన శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇన్చార్జిగా వాసిలి చంద్రశేఖర ప్రసాద్

శేరిలింగంప‌ల్లి, జూలై 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రక్షణ సేన (TRS – Telangana Rakshana Sena) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ తొలి జిల్లా ఇన్‌చార్జ్‌ల జాబితాను విడుదల చేశారు. మొత్తం 23 జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన (TRS) శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇన్చార్జిగా వాసిలి చంద్రశేఖర ప్రసాద్ నియ‌మితుల‌య్యారు. అలాగే హైదరాబాద్ కు కావేటి సవిత, జయశంకర్ భూపాలపల్లికి జోగు జగదీశ్ (మాజీ మంత్రి), జోగులాంబ గద్వాల్ – రాథోడ్ బాపురావు (మాజీ ఎమ్మెల్యే), ఆదిలాబాద్ – ముచ్చంక సునీల్ రెడ్డి, ఎల్లారెడ్డి – ఎదురుగట్ల సంపత్ గౌడ్, కామారెడ్డి – సంగనభట్ల రవీందర్ శర్మ, జగిత్యాల – ప్రసన్నటి పవన్ రావు, ములుగు – చెన్నుపల్లి శ్రవంతి, సిరిసిల్ల – ఎండి అక్బర్ మాజిద్, సంగారెడ్డి – కె. దుర్గాకర్ రెడ్డి, ఆర్మూర్ – మాస్సుగారి బాలరాజు (ఎన్‌ఎస్), నారాయణపేట్ – మర్రిశెట్టి బాబు, నిజామాబాద్ – చెల్లంగారి చంద్రు అప్పారావు, మెదక్ – బజ్జి అజయ్, తుంగతుర్తి – సూరారం కృష్ణవేణి (ఎన్‌ఎస్), స్టేషన్ ఘన్‌పూర్ – చిలుక ప్రదీప్ (ఎన్‌ఎస్), మక్తల్ – డీకె నివాస్ వెంకటస్వామి, గద్వాల్ – గోగర్ల రంజిత్ కుమార్, నారాయణఖేడ్ – గంగోజు శ్రీనివాస్, మునుగోడు – కంకటి మాధవి, పెద్దపల్లి – నరేంద్ర కుమారస్వామి, హుస్నాబాద్ – పాంగ్రే చరణ్ కుమార్ గౌడ్ లు నియామ‌కం అయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here