శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా మియాపూర్లోని ఆల్విన్ కాలనీలో సీనియర్ తెలుగు సినీ నటుడు అనంతబాబు తన ఎన్యూమరేషన్ ఫారాన్ని అధికారులకు అందజేశారు. జిల్లా ఎన్నికల అధికారి & స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, AERO/DC-48 జి. శ్రీనివాస్, MEO వెంకటయ్య, ACP సుష్మ, AMC ఎం. విజయ్ కుమార్ సమక్షంలో అనంతబాబు నుంచి అధికారులు ఎన్యూమరేషన్ ఫారాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా అనంతబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అందరు ఓటర్లు బూత్ లెవల్ అధికారులకు (BLOలు) సహకరించాలని కోరారు. సంబంధిత వివరాలు, అవసరమైన పత్రాలు, తాజా ఫోటోతో కూడిన ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత BLOకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అవసరమైన వివరాలు సమర్పించని పక్షంలో తుది ఓటరు జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీంతో ప్రతి అర్హ ఓటరు నిర్ణీత గడువులోపు ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.





