నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాల కల్పనే ప్రధాన డిమాండ్‌గా టీపీయూఎస్ఎస్ ను స్థాపించడం జరిగిందని, నేడు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఖాలీగా ఉన్నటువంటి 2.6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని, 2019 మార్చి బడ్జెట్లో నిరుధ్యోగ భృతికోసం రూ.1810 కోట్లు కేటాయించడం జరిగిందని, ఆ లెక్కన 24 నెలలకు 3 వేల చొప్పున ఒక్కో నిరుద్యోగికి రూ.74 వేలు వెంటనే చెల్లించాని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్న భోధన, భోధనేతర సిబ్బంది వేతనాలు లేక సంవత్సర కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల వద్ద ఫీజులు వసులు చేస్తూ సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్నతాత్కాలిక ఉద్యోగులకు గత సంవత్సర కాలంగా వేతనాలు అందడంలేవని, ప్రభుత్వం పై అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకుని వెంటనే తగిన విధంగా స్పందించాలని, లేనియెడల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చేబుతామని, వారం రోజుల్లో నిరుద్యోగ చెల్లించకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చిరించారు. ఈ సమావేశంలో టీపీయూఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి రాంనర్సింహారెడ్డి, సెక్రెటరీ జనరల్ రవికిరణ్, వేణు, ఉపాధ్యక్షులు కుమార్‌యాదవ్, గ్రేటర్ అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్, సెక్రెటరీ జనరల్ మహేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.