చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి చేరిక‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చ‌ందాన‌గ‌ర్ డివిజ‌న్ పీఏన‌గ‌ర్‌కు చెందిన టీఆర్ఎస్ నాయ‌కుడు రేప‌న్ వెంక‌టేష్ బుద‌వారం బిజెపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్ష‌ప‌తి యాద‌వ్‌, బిజేపి శేరిలింగంప‌ల్లి నాయ‌కుడు ఎం.ర‌వికుమార్ యాద‌వ్‌లు వెంక‌టేష్‌తో పాటు వారి అనుచ‌ర గ‌ణానికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఆ పార్టీ నేత‌లే జీర్ణించుకోలేక పోతున్నార‌ని, బిజెపితోనే రాష్ట్రానికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు అని గుర్తెరిగి పార్టీవైపు చూడ‌టం జ‌రుగుతుంద‌ని అన్నారు. కార్యక్రమంలో నాయ‌కులు రాఘవేంద్ర రావు, కసిరెడ్డి రఘునాథ్‌ రెడ్డి, రఘునాథ్ యాదవ్, ఎల్లేష్, గుండె గణేష్ ముదిరాజ్, వినోద్ యాదవ్, రాము, శ్రీనివాస్, చంద్ర రెడ్డి, రామ్ రెడ్డి, శివ యాదవ్‌, మ‌ల్లేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

బిజెపిలో చేరిన రేప‌న్ వెంక‌టేష్ బృందంతో ర‌వికుమార్ యాద‌వ్, రాఘ‌వేంద్ర‌రావు, క‌సిరెడ్డి ర‌ఘునాథ్‌రెడ్డి త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here