నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉపేంద్ర శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణా రావుల అధ్యర్యంలో నగరంలోని కొత్తపేటలో బుదవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అందులో భాగాంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మంత్రి సునీల్, ఉపాధ్యక్షులుగా గంప మాధవ రావు, పండ్ర ప్రగడ లక్ష్మణ్ రావులను సమితి పెద్దలు నియమించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పండ్రప్రగడ లక్షణరావు మాట్లాడుతూ తమపై నమ్మకముంచి భాద్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణా రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి కి అన్నీ వేళలో అందుబాటులో ఉండి ముందుకు నడిపిస్తామని తెలిపారు.