రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సత్యా గ్రహదీక్షకు మద్దతు తెలిపిన వల్లపు మాధవరావు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన బిసి సత్యాగ్రహ దీక్షకు జాతీయ బిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు వల్లపు మాధవరావు మద్దతు తెలియజేశారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన సత్యాగ్రహ దీక్షలో భాగంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు పార్టీలు రిజర్వేషన్ కల్పించాలని, వెనుకబడిన తరగతులు ప్రజలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు . బీసీలంతా ఐక్యం కావాలని గర్జిస్తే మన హక్కులు మనం సాధించుకోవచ్చని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here