శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్‌లో ఉన్న శ్రీరామకృష్ణ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో సంగీతం, భక్తి గీతాలు, దేశభక్తి గీతాల పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 26, 27 తేదీల్లో రాత్రి 7 గంటలకు ఈ పోటీలను నిర్వహిస్తామని అన్నారు. కూకట్పల్లి, మియాపూర్ పరిసర ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు ఎవరైనా సరే ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు శ్రీరామకృష్ణవివేకానంద సేవాసమితి ధ్యానమందిరం, ప్లాట్ 166, రాధామాధవ్ అపార్ట్ మెంట్ జంక్షన్ దగ్గర, ప్రగతి ఎంక్లేవ్ కాలనీ, మియాపూర్ అనే చిరునామాలో సంప్రదించవచ్చని లేదా 905989203 అనే నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.





