శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): వైకుంఠ ఏకాదశి పర్వదినంను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో స్వామి వారిని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, ఆయన సతీమణి శ్యామల దేవి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ కాలనీ ప్రెసిడెంట్ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు , దేవి నేనీ ప్రసాద్ , సీతారామ రావు, నాని, కుమార్ తదితరులు పాల్గొన్నారు.