శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో నిర్వహించ తలపెట్టిన అభివృద్ధి పనులకు డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, డివిజన్ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.