నమస్తే శేరిలింగంపల్లి: కోవిడ్ 19 రెండవ దశ ఉదృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్లలో శానిటైజేషన్ ప్రక్రియను పకడ్భందీగా చేపట్టాలని కోరుతూ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు వినతి పత్రం అందజేశారు. కోవిడ్ 19 సెకండ్ వేవ్ పరిణామాలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయని, ఈ క్రమంలో పారిశుద్ధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే జంట సర్కిళ్లలో వందల మంది కోవిడ్ బారిన పడ్డారని, అనేక మంది మృతు వాత పడ్డారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ప్రజారోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలోని అన్ని బస్తీలు, కాలనీలలో జెట్, మినిజెట్ ట్యాంకర్ వాహనాలతో యుద్ధ ప్రాతిపధకన శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.