శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ని ఆయన నివాసంలో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్లో మారబోయిన రవి యాదవ్ నేతృత్వంలో మన బస్తి బాట కార్యక్రమం గురించి వివరంగా చర్చించారు. మన బస్తి బాట కార్యక్రమం విజయాలను వినోద్ కుమార్ కి వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించాలని వినోద్ కుమార్ సూచించారని రవి యాదవ్ తెలిపారు.






