రాయ‌దుర్గంలో ఘ‌నంగా ఉర్సు ఉత్స‌వం

శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో జరిగిన ఉర్సు ఉత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దర్గాలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఉర్స్ ఉత్సవ కార్యక్రమంలో గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసి దట్టి కప్పి నాట్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈసందర్భంగా ముస్లింలు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ ముదిరాజ్, జగదీష్, సలావుద్దీన్, హ‌బీబ్, అంజాద్, ఇమ్రాన్, జకీర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here