గోపినగర్ జన చైతన్య SC వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘ‌న నివాళి

శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గోపినగర్ జన చైతన్య SC వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించకుంటే రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు బడుగు, బలహీన వర్గాలకు అందేవి కావని గుర్తుచేశారు. రిజర్వేషన్లు కల్పించటంతో చాలా మంది విద్యా, రాజకీయాలు, వైద్యరంగంలో రాణిస్తున్నారన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.

అంబేద్కర్ భవన్ నూతన కమిటికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ అభ్యర్ధన మేరకు కార్పొరేటర్ తన సొంత ఖర్చులతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడుతానని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలుపమని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్ గోపినగర్ బీసీ హాస్టల్ విద్యార్థులకు తన సొంత ఖర్చులతో రమేష్ వాలి బాల్, వాలి బాల్ నెట్ ను విరాళంగా అంద‌జేశారు. కార్పొరేటర్ నాగేందర్ యాద‌వ్ బీసి హాస్టల్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ ను బహుమానంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిప్యూటీ లేబర్ కమీషనర్ కోలా ప్రసాద్, హైకోర్టు అడ్వకేట్ రాజేశ్వర్ రావు, బీసీ హాస్టల్ వార్డెన్ సమీర్, మాల్యాద్రి, జన చైతన్య SC వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, అడ్వైజ‌ర్ డాక్టర్ ముసలయ్య, వైస్ ప్రెసిడెంట్ రంగుల ప్రవీణ్, ట్రెజరర్ సందీప్, వైస్ ప్రెసిడెంట్ పి.ఆనంద్, జాయింట్ సెక్రెటరీ పి.ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ సాయినాథ్, సలహాదారులు వెంకటేష్ , నర్సింహా, తుకారాం, దస్తగిర్, ఎజాస్, యేసు, రాములు, దేవ ప్రసాద్, గండయ్య, ఎర్రోళ్ల నర్సింహ, ఎర్రోళ్ల ఆనంద్ , తలారి నర్సింహులు , జనచైతన్య అసోసియేషన్ మహిళా సభ్యులు, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here