శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో బాపూజీ స్కూల్స్ చైర్మన్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి PAC చైర్మన్ అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా చేయాలని తెలిపేదే అయ్యప్ప తత్వమని అన్నారు, మనలోని దుర్గుణాలను వదిలి సన్మార్గం వైపు నడిపేదే అయ్యప్ప దీక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగయ్య, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి నర్సయ్య, లక్ష్మినారాయణ, భారతమ్మ, రమేష్, దుర్గ, యాదగిరి, రాజు, మల్లేష్, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






