శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల హుడా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన UPTOWN SKIN & DENTAL CLINIC ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ , ఎంబిసీ ఛైర్మెన్ జెరిపేటి జైపాల్ తో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వాహకులు ముఖ్య అతిధులను ఘనంగా ఆహ్వానించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ..డెంటల్ కు సంబంధించిన మెరుగైన వసతులతో క్లినిక్ ను తీర్చిదిద్దారని, క్లినిక్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పేషెంట్ లకు మెరుగైన వైద్యం అందించి వారి మన్ననలు పొందాలని, ఇలాంటి డెంటల్ కేర్ మరిన్ని బ్రాంచ్ లుగా ప్రారంభించాలని ప్రోత్సాహించారు. ఈ కార్యక్రమంలో రాంచందర్, జనార్దన్ రెడ్డి, డిసీసీ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్, కర్ణాకర్ గౌడ్, విజయేందర్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, లక్ష్మా రెడ్డి, సురేష్, నిర్వాహకులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.