శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 25 (నమస్తే శేరిలింగంపల్లి): నిత్యం యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చని గుల్ మోహర్ పార్క లో 7వ పతంజలి ఉచిత యోగా వార్షికోత్సవం సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మీర్ ఖాసిం తెలియజేశారు. యోగా వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుందని, అందరూ ప్రతి రోజు ఒక గంట సమయం యోగాకు కేటాయించాలని కోరారు. రోగం వచ్చాక నయం చేసుకోవడం కంటే రాకుండా నిరోధించుకోవాలని, నిత్యం యోగా చేయడం వల్ల బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలను నియంత్రించవచ్చని యోగా గురువు సురేందర్ పటేల్ నూనె తెలిపారు. 7 సంవత్సరాల నుంచి నిత్యం గుల్ మోహర్ పార్క్ కాలనీలో ఉచిత యోగా తరగతులు జరుగుతున్నాయని, అందరిలో యోగా అవగాహన రావాలని, తరగతులకు హాజరు కావాలని యోగాగురువు గారెల వెంకటేష్ తెలిపారు. సీనియర్ సభ్యుడు, నేతాజీ నగర్ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ ఉచిత యోగా మనకు అందుబాటులో ఉండడం మన అదృష్టమని, అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.
7వ వార్షికోత్సవాలలో పాల్గొన్న వారిలో కాలనీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, సీరియర్ సభ్యులు అన్నపూర్ణ, లక్ష్మి, ఉదయకుమారి, దీప, రాజేంద్ర ప్రసాద్, రవికాంత్, నాగేష్, ప్రేమ్ చంద్, శ్రీశైలం, సురేష్, సభ్యులు ఉన్నారు.