నమస్తే శేరిలింగంపల్లి: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ఆటో స్టాండ్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనబడటంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవఖానాకు తరలించారు. కాగా మృతుడి వయసు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, అతని ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవని, అతని బట్టలు , అతను వేషధారణ బట్టి ఏదో జబ్బుతో చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు మృతుడి వివరాలు తెలిసినవారు 100 డైల్ లేదా చందానగర్ పోలస్‌స్టేషన్ ఫోన్ నంబర్లు 040-27853911, 9490617118, 7901113092, 7901110877లలో సమాచారం అందించాలని ఎస్ఐ రాములు సూచించారు.