శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): కార్తీక మాస వనభోజనాలతో ఐక్యత,స్నేహభావం పెంపొందుతాయని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్‌పల్లి చిత్తారమ్మ దేవాలయంలో ఏర్పాటుచేసిన కూకట్‌పల్లి కౌండిన్య సేవా సమితి సామూహిక వనభోజనాల కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడుతూ ఒకే చోట చేరి సామూహిక భోజనాలు చేయడం అభినందనీయమని అన్నారు. కార్తీకమాస వన భోజనాలు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు శేరిలింగంపల్లి కౌండిన్య సేవా సమితి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్, నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, ఏకాంత్ గౌడ్, యాదగిరి గౌడ్, సుధాకర్ గౌడ్, కరుణాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, హరినాథ్ గౌడ్, విష్ణు, మహిళా నాయకులు కల్పన ఏకాంత్ గౌడ్, శిరీష సత్తూర్ తదితరులు పాల్గొన్నారు.