శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో అవేటి మనోహర్ సురభి కళా మందిరంలో మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ సౌజన్యంతో, సురభి కాలనీ వాసుల సంక్షేమ సంఘం సహకారంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, కంటి, దంత, రక్తపోటు, షుగర్, పల్స్, బీ.ఎం.డి (ఆర్థో, బోన్ మ్యారో డెన్సిటీ), ఈ.సీ.జీ. పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ P. ఆదిత్య (జనరల్ ఫిజిషియన్), డాక్టర్ నదీమ్ (డెంటల్), వాసన్ ఐ కేర్ నరేష్ గౌడ్ తదితరులు వైద్యసేవలు అందించారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానము, నడక కనీసం 40 నిమిషాలు చేయాలి. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు S. A. చంద్రశేఖర్, S. A. జయకృష్ణ, C. V. భాను, V. జితేంద్ర, R. వెంకట్ రెడ్డి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్ధన్, పాలం శ్రీను, అమ్మయ్య చౌదరి, విజయలక్ష్మి, M. S. రావు, సత్యవాణి, హాస్పిటల్ ప్రతినిధి నరేష్ తదితరులు పాల్గొన్నారు.