నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలన్నింటిని దశల వారీగా పరిష్కరించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని విద్యానగర్ కాలనీలో రూ. 25 లక్షలతో చేపట్టిన భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను కాలనీ వాసులతో కలిసి గురువారం చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కాలనీలలో నెలకొన్న సమస్యలపై తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథరెడ్డి, కాలనీ వాసులు వెంకట్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నీలకాంత్ రెడ్డి, రాజేష్ దూబే , ఉమామహేశ్వర్ రావు, సందీప్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, హరీష్ రెడ్డి, శంకర్ , వెంకట్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
